తాము ఇష్టపడి రెడీ చేసుకున్న సబ్జెక్టుని డైరక్షన్ చేయలేని సిట్యువేషన్ లో , ఆ స్క్రిప్టుపై నమ్మకంతో నిర్మాతగా మారి అయినా సినిమాని తెరకెక్కించాలనుకుంటారు. అలాంటి పనే ఇప్పుడు దర్శకుడు సురేంద్రరెడ్డి చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి... సైరా వంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరక్టర్ సురేంద్రరెడ్డి.

చారిత్రక నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సురేంద్రరెడ్డిని మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచేలా చేసింది. ఇప్పుడు ఆయనతో స్టార్ హీరోలంతా చేయటానికి ఉత్సాహం చూపెడుతున్నారు. కానీ ఆయన మాత్రం స్క్రిప్టు రెడీ చేసుకుంటూ...కూల్ గా ఓ సినిమాని నిర్మించే పనిలో పడ్డారని సమాచారం. అదీ వరుణ్ తేజ హీరోగా అని తెలుస్తోంది.

ఆరుపదుల వయసులో జిమ్ వర్కౌట్.. మెగాస్టార్ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా!

సురేందర్ రెడ్డి నిర్మించనున్న ఈ  ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సురేందర్ రెడ్డి అందిస్తున్నాడట. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం ఆయన శిష్యుడికి అప్పగించనున్నారని తెలుస్తోంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. మొదట్లో తాను చేద్దామనుకుని రెడీ చేసుకున్న సబ్జక్టు అని, అయితే సైరా తను ప్యాన్ ఇండియా సినిమా లు చేసే స్దాయికి రావటంతో ఈ సబ్జెక్టు ని తన శిష్యుడుకి అప్పచెప్పినట్లు సమాచారం.

అతను ఎవరు..ఎప్పటి నుంచి సినిమా ప్రారంభం కానుందనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. విభిన్నమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.

ఈ ఏడాది `ఎఫ్2`, `గద్దలకొండ గణేష్` వంటి విజయాలు అందుకున్న వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాక్సర్‌గా వరుణ్ కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రారంభం కాకముందే మరో సినిమాకు వరుణ్ ఓకే చెప్పేయటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.