స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన కెరీర్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన వసూళ్లనే సాధించింది. కానీ ఇతర భాషల్లో తీవ్రంగా నిరాశపరిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని చిత్రీకరించిన విధానానికి ప్రశంసలు దక్కాయి. 

సైరా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించే చిత్రంపై సందిగ్ధత నెలకొంది. మొదట ప్రభాస్ తో సురేందర్ రెడ్డి చిత్రం ఉండబోతోందంటూ వార్తలు వచ్చాయి. కాయాన్ని ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. దీనితో సురేందర్ రెడ్డి వరుణ్ తేజ్ ని ఎంచుకున్నాడు. మరోసారి సురేందర్ రెడ్డి మెగా హీరోని డైరెక్ట్ చేయడం ఖాయం అనుకుంటున్నా తరుణంలో ఊహించని వార్తలు వస్తున్నాయి. 

వరుణ్ తేజ్, సురేందర్ రెడ్డి ల చిత్రం చర్చల దశలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధానంగా రెండు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి తదుపరి చిత్రానికి కూడా భారీ బడ్జెట్ అవసరమట. దీనితో స్టార్ హీరో అయితే బావుంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారని.. అందుకే వరుణ్ తేజ్ కాకుండా మరో స్టార్ ని వెతికే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

చిరంజీవిని చూసే విలువలు పాటిస్తున్నాం.. పవన్ తో సినిమాపై బన్నీ కామెంట్స్!

మరోవైపు సురేందర్ రెడ్డి.. మెగా ఫ్యామిలీ మధ్య నెలకొన్న వివాదం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సైరా చిత్రానికి గాను సురేందర్ రెడ్డికి ఇంకా రాంచరణ్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని  అంటున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్టర్స్ కౌన్సిల్ లో చరణ్, చిరంజీవిపై ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం కారణంగా సురేందర్ రెడ్డి దర్శత్వంలో నటించే ఆలోచనని వరుణ్ విరమించుకున్నట్లు మరో వాదన వినిపిస్తోంది.