బాక్సాఫీస్ వద్ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ విజయమిది. 

ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా మళయాళంలో కూడా క్రేజ్ ఉన్న ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బన్నీ తన మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బన్నీ వరుసగాజాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అనేక విషయాలు పంచుకున్నాడు. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి అల్లు అర్జున్ ని ప్రశ్నించగా.. మా అందరికి చిరంజీవి గారు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నాం. మేము పాటిస్తున్న విలువలు చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నవే అని అల్లు అర్జున్ తెలిపాడు.

చిరంజీవి గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. అందుకే మా ఫ్యామిలీతో పాటు ఎందరో నటులకు ఆయన ఆదర్శం అని బన్నీ తెలిపాడు. ఇక తన కెరీర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ అవకాశం వస్తే బాలీవుడ్ లో నటిస్తానని తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో కలసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. అది కథను బట్టి ఆధారపడి ఉంటుంది. 

ఎట్టకేలకు న్యూయార్క్ వెళుతున్న మోక్షజ్ఞ.. బాలయ్య కోరిక నెరవేరుతుందా!

అందరికి సరిపడే పాత్రలు ఉండే స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా నటిస్తాం అని అల్లు అర్జున్ బదులిచ్చాడు. ఇక పూర్తి స్థాయిలో ఒక డాన్స్ మూవీ చేసే ఆలోచన లేదని.. ఎందుకంటే డాన్స్ అనేది సినిమాలో ఒక భాగం మాత్రమే అని బన్నీ అభిప్రాయపడ్డాడు.