సురేఖావాణి... ఈ పేరు చెప్పగానే సినిమాల్లో అక్క పాత్రలు, వదిన పాత్రలు వేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనందరికీ ఠక్కున మనసులో మెదులుతుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండేవారికైతే... సురేఖ వాణి ఒథెర్ సైడ్ కూడా తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను వీడియోలను ఈమె తరచుగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. 

గతంలో సురేఖావాణి తన కూతురితోసహా ఉన్న కొన్ని ఫోటోలను ;పోస్టు చేసినప్పుడు చాలా మంది ఆమెను ట్రోల్ చేసారు. ఒకరైతే ఏకంగా కూతురిని ఎలా పెంచకూడదో అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై సురేఖావాణి తన ట్విట్టర్ అకౌంట్ నుండి రిప్లై ఇచ్చినట్టుగా కూడా వార్తలొచ్చాయి. టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఈ విషయమై ట్వీట్ చేసారు. 

ఇక తాజాగా సురేఖావాణి స్వయంగా కెమెరా ముందుకొచ్చి ఆ ట్విట్టర్ అకౌంట్ తనది కాదని తెలిపింది. అది ఫేక్ అకౌంట్ అని తెలపడంతో పాటుగా... తన కూతురి గురించి తన గురించి కామెంట్ చేసిన ఆ సదరు వ్యక్తికి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. 

Also read: బాలీవుడ్ లో నితిన్ 'భీష్మ' రీమేక్.. రొమాంటిక్ హీరోతో బడా నిర్మాత ప్లాన్?

తాను గనుక తెలుసుకోవాలనుకుంటే... ఈ కామెంట్ పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోవడం పెద్ద విషయం కాదని, కానీ లైట్ తీసుకున్నానని అనింది. ఎప్పుడో రిప్లై ఇద్దామని అనుకున్నప్పటికీ బిజీ గా ఉంది కుదరలేదని తెలిపింది. 

చెత్తనా కొడకా, నా కొడకా అంటూ తనలోని పాత సురేఖను బయటకు తీసుకురావొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. తల్లి సురేఖవాణితోపాటు ఆమె కూతురు కూడా కెమెరాఖ్త్ ముందుకు వచ్చారు. 

అయితే.. ఏదైతే సురేఖ అఫిషియల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఉందొ... అది తనది కాదని చెప్పుకొచ్చింది. దాన్ని మేనేజ్ చేస్తున్నవారు, తన మీద వచ్చిన కామెంట్స్ కి గట్టిగానే రిప్లై ఇచ్చారని, అయినప్పటికీ.... అది తనది కాదని ఆమె స్పష్టం చేసారు. దాని గురించి రిపోర్ట్ చేస్తున్నట్టు తెలిపారు. 

గతంలో కూడా సురేఖావాణి భర్త చనిపోయినప్పుడు కూడా ఈ తల్లి కూతుళ్లపైనా నెటిజన్లు కొన్ని నీచమైన కామెంట్లు చేసారు. అప్పుడు కూడా సురేఖావాణి కూతురు సుప్రీతా వారిపై ఫైర్ అయ్యారు. 

తమపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారు అన్నీ తెలుసుకొని మాత్రమే విమర్శించాలని.. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలని రాసుకొచ్చింది. 

ముందు మీ లైఫ్ చూసుకోండి.. ఆ తరువాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి అంటూ క్లాస్ తీసుకుంది. తన తల్లి ఇప్పుడిప్పుడే భర్త మరణం నుండి కోలుకుంటుందని చెప్పుకొచ్చింది.