సినీ నటి తన రెండో భర్త లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు ముగప్పేర్‌కు చెందిన ఓ నటి (39) తన భర్తకి విడాకులిచ్చి విడిగా జీవిస్తోంది. ఆమెకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయితే ఈమె సొంతంగా యోగ శిక్షణశాలను నిర్వహిస్తోంది.

సినీ, టీవీ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. నటుడు శివ కార్తికేయ హీరోగా నటించిన 'మాన్ కరాటే' సినిమాలో ఈమె నటించింది. అలా సాంకేంతిక నిపుణుడు శరవణన్ సుబ్రమని(42)తో పరిచయం కలిగింది. ఈ పరిచయం అతడితో రెండో పెళ్లికి దారి తీసింది. అయితే ఈ నటి బుధవారం స్థానిక తిరుమంగళం మహిళా పోలీస్ స్టేషన్ లో శరవణన్ పై ఫిర్యారు చేసింది.

అడల్ట్ సీన్స్ లో రెచ్చిపోయిన నటి.. తప్పుగా అనుకోవద్దని..!

రెండో భర్త శరవణన్ తన నగలను, డబ్బుని దోచుకున్నాడని ఫిర్యాదులో రాసుకొచ్చింది. అంతేకాదు.. అతడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. అతడి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డాన్స్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడని, తన పిల్లలను కొడుతున్నాడని తెలిపింది.

శరవణన్ కి గతంలో ఆర్తి అనే మహిళతో పెళ్లైందని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది. తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టి మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది.

అంతేకాకుండా ఇప్పుడు తన మొదటిభార్య, కిరాయి మనుషులతో కలిసి శరవణన్ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.