తన సినిమా గురించి తప్పుగా ప్రచారం చేయకండని రిక్వెస్ట్ చేస్తోంది నటి సోనా. కుశేలన్, కో వంటి పలు శృంగార పాత్రల్లోనూ, ప్రతి నాయకి పాత్రల్లోనూ నటించి సంచలన నటిగా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఆ మధ్య నిర్మాతగా మారి సినిమాలు చేయాలనుకుంది.

అలా మొదలుపెట్టిన సినిమా ఆదిలోనే ఆగిపోయింది. ఇటీవల స్మోకింగ్ మానేశానని కామెంట్స్ చేసిన వార్తల్లో నిలిచిన సోనా.. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక మలయాళ సినిమాలో శృంగారాత్మక పాత్రలో విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసింది ఈమె. ఇప్పుడు ఆ విషయమే చర్చకి దారి తీసింది. అయితే తాను ఆ పాత్రలో అందాలను ఆరబోసినా.. దానికొక కారణం ఉందని చెబుతోంది ఈ మలయాళ నటి.

మద్యపానం మానేశా.. శృంగార తార సోనా వ్యాఖ్యలు!

అంతగా అందాలు ఆరబోసిన సినిమా 'పచ్చమాంగా'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో సోనా నటనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీంతో నటి సోనా వాటిపై వివరణ ఇచ్చే విధంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో 'పచ్చమాంగా' ఒక బలమైన కథాంశంతో కూడినదని చెప్పింది.

సినిమాల మాదిరి క్లాసికల్ గా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది. సినిమా ట్రైలర్ లో తాను ధరించిన దుస్తులు, కొద్దిపాటి సన్నివేశాలను చూసి శృంగారభరిత పాత్రలో నటించినట్లు భ్రమను కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చింది.

అది నిజం కాదని.. తాను వేసుకున్న బట్టలను బట్టి ఇదొక గ్లామరస్ సినిమా అనే ఫీలింగ్ కి రాకూడదని.. ఇదొక మంచి కథా చిత్రమని చెప్పింది. తన కథా పాత్ర కూడా బలమైనదని చెప్పింది. సినిమా విడుదలైన తరువాత అందరికీ విషయం అర్ధమవుతుందని అన్నారు.