సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సౌత్ ఇండస్ట్రీలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పొంగల్ కి సూపర్ స్టార్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు.

టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇకపోతే రజినీకాంత్ ఈ సినిమాతో ఎలాగైనా అన్ని భాషల్లో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. కబాలి అనంతరం తలైవా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ రోజులు సందడి చేయలేపోతున్నాయి. ఇ

టీవల దర్బార్ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాడు.  ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంతవరకు ముగించేసి సినిమా టీజర్ ని విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. వచ్చే నెల 12న తలైవా 69వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా అదే రోజు దర్బార్ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్  చేసుకుంటున్నారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయిలో అభిమానుల సమక్షంలో సూపర్ స్టార్ తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోబోతున్నాడు.  అదే రోజు సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది.  అందుకు నిర్మాతలు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

ఇప్పటికే రెండు స్పెషల్ సాంగ్స్ ని కంపోజ్ చేసి రెడీగా ఉంచిన అనిరుద్ త్వరలోనే మరో రెండు పాటల్ని కూడా ఫినిష్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎలాగైనా రజిని బర్త్ డేను గ్రాండ్ గా నిర్వహించి సినిమాకు మంచి క్రేజ్ తేవాలని నిర్మాతలు వేసుకుంటున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.