సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తొలిరోజే హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.

మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండో రోజు మొత్తంగా రూ.63 నుండి 65 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మూడో రోజున ఈ సినిమా వంద కోట్లు దాటేలా ఉందని అంటున్నారు.

'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్లు!

మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా రాబట్టింది. గతంలో మహేష్ నటించిన 'మహర్షి' సినిమా తొలిరోజు రూ.24.68 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని 'సరిలేరు నీకెవ్వరు' బ్రేక్ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని దాదాపు రూ.75 కోట్లకు అమ్మారని సమాచారం. తొలిరోజే ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ సాధించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తీసుకురావడం ఖాయమనిపిస్తోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి కీలకపాత్ర పోషించింది.