స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. తొలి షో నుండే ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.45 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ రూ.30 కోట్ల వరకు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక లెక్కలు రావాల్సివుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5 కోట్లు, కేరళ ఇతర రాష్ట్రాల్లో కలిపి మూడున్నర కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

ఏరియాల వారీగా ఏపీ, తెలంగాణాలో సినిమా కలెక్షన్లు..

నైజాం............................................. రూ.5 కోట్లు 
సీడెడ్.............................................. రూ.2.5 కోట్లు 
ఉత్తరాంధ్ర..................................... రూ.2 కోట్లు 
ఈస్ట్, వెస్ట్......................................... రూ.4.5 కోట్లు 
గుంటూరు....................................... రూ.3 కోట్లు 
కృష్ణా, నెల్లూరు............................... రూ.3 కోట్లు 

ఓవరాల్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20 కోట్లకు దగ్గరగా వసూలు చేసిందని సమాచారం.