కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ఇటీవల 69వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సాధారణంగా ఏ హీరో అయినా సరే వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలు చేయడం తగ్గించేస్తారు. కానీ తలైవా మాత్రం ఎవరు ఊహించని విధంగా చక చక సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

ఏడు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు.  ఇక రీసెంట్ గా దర్బార్ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేయనున్నాడు. ఇక ఆ సినిమా అనంతరం నెక్స్ట్ శివ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. పక్కా కమర్షియల్ హంగులతో రూపొందనున్న ఆ సినిమా గురించి అప్పుడే రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ రజిని సిస్టర్ పాత్రలో కనిపించనుందని టాక్ వచ్చింది.  ఇక ఇప్పుడు ఫ్రెష్ గా సూపర్ స్టార్ డ్యూయల్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు టాక్. రోబో తరహాలో తలైవా ఒక పాత్రలో విలన్ షేడ్స్ చూపించబోతున్నాడట. మరో క్యారెక్టర్ లో మంచితనానికి మారుపేరుగా ఉండే పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

రజినీకాంత్ లో కొత్త తరహా నటనను శివ తన సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా స్టార్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.