సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలైన ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లో బిగ్ బాస్ షోలు అత్యధిక టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. 

ఇక తెలుగులో ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండవ సీజన్ ని నాని విజయవంతంగా నడిపించాడు. ఇక మూడవ సీజన్ లో అడుగుపెట్టిన కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3ని రికార్డు టీఆర్పీ రేటింగులతో నిలబెట్టాడు. ప్రతి సీజన్ కి బిగ్ బాస్ లోకి ఆదరణ పెరుగుతోంది. 

కరోనా ఎఫెక్ట్: మతిమరుపు నాని.. అతి శుభ్రత శర్వానంద్ కలిస్తే ?

దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు నాల్గవ సీజన్ ని విభిన్నంగా డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న ఫార్మాట్ లో పూర్తిగా మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాల్గవ సీజన్ కు హోస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ వ్యవహరించబోతున్నట్లు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు నాల్గవ సీజన్ కోసం మహేష్ ని సంప్రదించారట. అందుకు మహేష్ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 

నాల్గవ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మహేష్ ని ఎంచుకున్నట్లు టాక్. రాబోవు రోజుల్లో దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది.