టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ దర్శకుల్లో మారుతి ఒకరు. మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమా తీసి హిట్లు కొట్టడంలో మారుతి దిట్ట. మారుతి చివరగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో ప్రతిరోజూ పండగే అనే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా మారుతి, శర్వానంద్ కాంబోలో వచ్చిన 'మహానుభావుడు' అనే చిత్రం గురించే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. 

ఎందుకంటే ఆ చిత్రంలో హీరో పాత్రలాగే ప్రస్తుతం ప్రజలంతా వ్యవహరించాల్సి వస్తోంది. మహానుభావుడు చిత్రంలో శర్వానంద్ అతిశుభ్రత పాటించే యువకుడిగా కనిపిస్తాడు. హీరోయిన్ ముట్టుకున్నా సరే.. శానిటైజర్ వాడుతాడు. ఆ సన్నివేశాలు మంచి హాస్యాన్ని అందించాయి. ప్రస్తుతం చైనాల్లో పుట్టుకొచ్చిన రాకాసి వైరస్ కరోనా ప్రభావం ఇండియాతో పాటు ప్రపంచ దేశాలపై పడింది. 

దీనితో ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరం వచ్చింది. దీనితో దర్శకుడు మారుతి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మీరు తెరకెక్కించిన మహానుభావుడు చిత్రంలో లాగే ప్రస్తుతం ప్రజలు ఉండాల్సిన పరిస్థితి దీనిని మీరు ఊహించారా అని ప్రశ్నించగా.. కలలో కూడా ఊహించలేదని మారుతి అన్నారు. కరోనా వల్ల ప్రతి ఒక్కరూ మహానుభావుడు చిత్రం గురించి మాట్లాడుతుంటే ఇదొక భిన్నమైన అనుభవంగా అనిపిస్తోంది. 

స్టన్నింగ్ హాట్.. టైట్ ఫిట్ డ్రెస్ లో నమిత మెస్మరైజింగ్ లుక్

ఎవరైనా తుమ్ముతుంటే ఆమడదూరం పరిగెత్తే వ్యక్తులని చూస్తే తప్పకుండా నవ్వొస్తుంది. కానీ ఇప్పుడంతా ఇలాగే చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నెలకొన్న పరిస్థితుల్లో ఏదైనా కథ ఆలోచించారా అని ప్రశ్నించగా.. ఇలాంటి పరిస్థితులు ఒక్కో దర్శకుడికి ఒక్కోలా అనిపిస్తాయి. 

నాకు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో భలే భలే మగాడివోయ్ లో నాని, మహానుభావుడులో శర్వానంద్ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చినట్లు మారుతి చెప్పుకొచ్చారు. కమర్షియల్ సినిమా కోణంలో ఆలోచిస్తే ఇది చాలా మంచి పాయింట్. మరి మారుతి దీనిపై కథ డెవెలప్ చేస్తారో లేదో చూడాలి.