కరోనా విజృంభణకు ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. అగ్ర రాజ్యం, చిన్న దేశం అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 5 వేలు దాటిపోయాయి.  అమెరికా, ఇటలీ లాంటి దేశాల పరిస్థితి చెప్పనవసరం లేదు. 

కరోనా ప్రభావాన్ని ముందే పసిగట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇండియాలో పరిస్థితి కొంత మేరకైనా అదుపులో ఉంది. ఓ వైపు వైద్యులు కరోనా భాదితులకు వైద్యం అందించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 

అలాగే లాక్ డౌన్ అమలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సమర్థవంతగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పోలీసుల సేవల్ని కొనియాడారు. ఈమేరకు పోలీసులకు సెల్యూట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. 

6 నెలల క్రితమే లీక్ చేసిన అల్లు అర్జున్.. తెలివిగా మ్యానేజ్ చేశాడు!

లాక్ డౌన్ ని అమలు చేస్తున్న తెలంగాణ పోలిసుల ఫోటో షేర్ చేస్తూ..దీనిపై నేను మనస్ఫూర్తిగా స్పందిస్తున్నా. కోవిడ్ 19కు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు చేస్తున్న పోరాటం అద్భుతం. ఇలాంటి క్లిష్ట సమయాల్లో పోలీసులు మనకోసం, మన కుటుంబాల ఆరోగ్యం కోసం పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న మీ అందరికి నా సెల్యూట్ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

ఇదిలా ఉండగా కరోనాని ఎదుర్కొనేందుకు ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రిటీలు భారీగా విరాళాలు అందించారు. మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సినీ కార్మికుల కోసం 25 లక్షల విరాళం అందించాడు.