స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదు. అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్  హిట్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. సుకుమార్ క్రియేటివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుధవారం రోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. 

ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్ప రాజ్. మాస్ అండ్ రస్టిక్ లుక్ లో బన్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్ర టైటిల్ ని అల్లు అర్జున్ స్వయంగా 6 నెలల క్రితమే లీక్ చేశాడంటే నమ్మగలరా.. అయినా ఇది నిజం. 

సమంత, చైతు సైలెంట్.. అక్కినేని ఇంట ఏం జరుగుతోంది ?

గత ఏడాది నవంబర్ లో అల్లు అర్జున్ సుకుమార్ ని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. అభిమానులకు అర్థం అయి అర్థం కాని విధంగా తెలివిగా టైటిల్ పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ పోస్ట్ చేసిన అక్షరాలు విభిన్నంగా ఉండడంతో అప్పట్లో ఎవరూ పుష్ప టైటిల్ పసిగట్టలేకపోయారు. 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.