Asianet News TeluguAsianet News Telugu

'సరిలేరు నీకెవ్వరు' టీజర్.. ట్విట్టర్ లో ట్రెండింగ్!

ఇప్పుడు సినిమా టీజర్, స్పెషల్ వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో అనిల్ రావిపూడి శనివారం ఉదయం టీజర్ కి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. 

Super star Mahesh Babu's Sarileru Neekevvaru teaser release update
Author
Hyderabad, First Published Nov 16, 2019, 1:57 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న నూతన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు ప్రచార చిత్రాలను ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు సినిమా టీజర్, స్పెషల్ వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో అనిల్ రావిపూడి శనివారం ఉదయం టీజర్ కి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు.

సీరియల్ నటిని రేప్ చేసిన జూనియర్ ఆర్టిస్!

అందులో మహేష్ బాబు గన్ ట్రిగ్గింగ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'టీజర్ లోడింగ్' అని అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. దీని బట్టి టీజర్ త్వరలోనే ప్రేక్షకుల  ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. సినిమా హ్యాష్ ట్యాగ్స్ బాగా వైరల్  అవుతున్నాయి.

ఈ సినిమాతో పోటీగా రంగంలోకి దిగుతోన్న అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో దూసుకుపోతుంటే మహేష్ మాత్రం ఈ విషయంలో బాగా వెనుక పడ్డాడు. 

అందుకే ఇకపై సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా సినిమాకి సంబంధించిన కొన్ని వీడియోలను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికిటీజర్ లోడింగ్ అంటూ షార్ట్ వీడియోతో సరిపెట్టారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios