ఎంతో కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఖాన్ లు, కపూర్ ల ఫ్యామిలీ ఏలుతూ వస్తున్నాయి. ఇండస్ట్రీలోకి కొత్తగా ఎవరు వచ్చినా.. వీరిని మాత్రం బీట్ చేయలేరు. అలాంటిది ఓ విషయంలో నటి సన్నీలియోన్ స్టార్లను వెనక్కి నెట్టి ముందంజలో దూసుకుపోతుంది.

గత దశాబ్ద కాలంలో అత్యధిక మంది నెటిజన్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో సన్నీలియోన్ మొదటి స్థానంలో ఉందట. ప్రముఖ సెర్చ్ ఇంజన్ యాహూ ఈ విషయాన్ని వెల్లడించింది. 'యాహూ' మోస్ట్ సెర్చెడ్ సెలబ్రిటీ పేరుతో ప్రతి ఏడాది వివరాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

వరల్డ్ ఫెమస్ లవర్.. కిక్కు కోసం కష్టపడుతున్నాడు

2019 గాను నటి సన్నీలియోన్, సల్మాన్ ఖాన్ మోస్ట్ సెర్చెడ్ సెలబ్రిటీలనే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది అత్యధిక మంది ఈ ఇద్దరి గురించే వెతికారట. అంతేకాదు, ఈ దశాబ్దంలో అత్యధిక మంది శోధించిన సెలబ్రిటీగా సన్నీ రికార్డు సృష్టించింది. వీళ్ల తరువాత స్థానంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు.

2016, 2017లోనూ సన్నీనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఈ దశాబ్దంలోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా 'దంగల్' నిలిచినట్లు యాహూ వెల్లడించింది. 2016లో విడుదలైన ఈ  సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

దీని తరువాత 'భజరంగీ భాయ్ జాన్', 'పీకే', 'సుల్తాన్', 'టైగర్ జిందా హై', 'ధూమ్ 3', 'సంజు', 'వార్', 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాల గురించి అత్యధికమంది నెటిజన్లు వెతికారు. ఇక హీరోల్లో 'ఐకాన్ ఆఫ్ ది ఇయర్' గా హృతిక్ రోషన్, హీరోయిన్లలో సారా అలీ ఖాన్ నిలిచారు.