మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమా నుంచి విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రయోగాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయనే చెప్పాలి. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త తరహా యాంగిల్ ని చూపిస్తూ అంటూ మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరల్డ్ ఫెమస్ లవర్ తో బిజీగా ఉన్న విజయ్ ఈ సినిమాతో కొత్త కిక్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు.

 

టాక్సీ వాలా అనంతరం డియర్  కామ్రేడ్ సినిమాతో కాస్త తడబడిన రౌడీ స్టార్ ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా షూటింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ క్లయిమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమాలో సరికొత్త గెటప్ తో దర్సనమివ్వనున్నట్లు ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ వచ్చేసింది.  ఇక క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయట. ఆ సీన్స్ లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ నుంచి టాక్ వస్తోంది. దర్శకుడు క్రాంతి మాధవ్ గతంలో డైరెక్ట్ చేసిన ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలకు సంబందించిన నటన అద్భుతంగా ఉంటుంది.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను కూడా దర్శకుడు అలానే ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్ లవ్ సీన్స్ గట్టిగానే ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.