యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న తాజా సినిమా ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ (‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌). జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో... హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. ‘నిను వీడని నీడను నేనే’ తో సీరియస్ హిట్ కొట్టిన సందీప్ కిషన్‌.. ఈ సినిమాతో అందరినీ నవ్వించి మరో హిట్టుని ఈజీగా తన ఖాతాలో వేసుకోనున్నాడు అంటున్నారు.  

ఈ  చిత్రం ఈ శుక్రవారం( నవంబరు 15న) విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం పై దర్శక,నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దాంతో ఈ సినిమా ప్రీమియర్ షో లను ఆంధ్రా, తెలంగాణాలోని నాలుగు సెంటర్లలో వేస్తున్నట్లు సమాచారం.  ఆ సెంటర్లు హైదరాబాద్, తెనాలి, కర్నూలు, రాజమండ్రి.

మంచు మనోజ్ న్యూ మూవీ.. లేటెస్ట్ అప్డేట్

చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... తెనాలి రామకృష్ణ అంటే తిమ్మిని బొమ్మి చేయగల సమర్థుడని చరిత్రలో చదువుకున్నాం. మా చిత్రంలో లాయర్‌గా సందీప్‌ పాత్ర కూడా అలాగే ఉంటుంది. తెనాలి రామకృష్ణకు ఉండే అన్ని లక్షణాలు ఈ లాయర్‌ పాత్రకు ఉంటాయి. అందుకే ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ అనే టైటిల్‌ పెట్టాం అంటున్నారు.  రాజీపడితే కేసులు, గొడవలు, కోర్టులు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో ఓ కేసులో రాజీపడే ప్రసక్తే లేదు అన్నట్టుంటాడు. రెండు ఉద్దేశాలు కలిగిన హీరో పాత్రని వినోదాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతో సందీప్‌కి కొత్త ఇమేజ్‌ వస్తుంది అని చెప్పుకొచ్చారు.

హీరో సందీప్‌ కిషన్  మాట్లాడుతూ. `ఇటీవల థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాలు చేశా.. చాలా కాలం తరువాత మంచి కామెడీ సినిమా చేశా. రాజసింహా ఇచ్చిన కథకు నాగేశ్వర రెడ్డి లాంటి మంచి దర్శకుడు దొరకటం అదృష్టం. ఆ కామెడీ స్టైల్‌ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్‌ హన్సికది కూడా చాలా మంచి పాత్ర అన్నారు.

ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా సందీప్ కిషన్ వ్యవహరించాడు. ఆయన జోడీగా హన్సిక నటించగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది.  ముర‌ళీ శ‌ర్మ, బ్రహ్మానందం, వెన్నెల‌ కిశోర్‌, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ నిర్మిస్తున్నారు.