మంచి ఎనర్జీతో కనిపించే కుర్ర హీరోల్లో మంచు మనోజ్ ఒకరు. ఎలాంటి సినిమా చేసినా తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా కనిపించే ఈ యంగ్ హీరో కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ లు అందుకోలేకపోయారు ఆ మధ్య పలు సామజిక అంశాలపై స్పందిస్తూ హడావుడిగా అకనిపించి మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.

గట్టిగానే  టాక్ వచ్చింది.  ఇక భార్యతో విడాకులు తీసుకోవడంతో ఆ వార్త అందరిని ఆశ్చర్యపరిచింది. కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనోజ్ మొత్తానికి మళ్ళీ రెగ్యులర్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమాలు చేయడానికి ఒక సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

MM ఆర్ట్స్ అనే బ్యానర్ లో మనోజ్ సొంతంగా తన సినిమాను తనే నిర్మించుకోనున్నాడు.  గత కొన్నేళ్లుగా మనోజ్ కి దగ్గరగా ఉంటున్న కొత్త దర్శకుడు ఆ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న మనోజ్ త్వరలోనే తన కొత్త సినిమా గురించి మరిన్ని విషయాలని తెలియజేయనున్నారు.

ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నాభా నటేష్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా మంచు హీరో నభా వైపే ముగ్గు చూపాడు. మరికొన్ని వారాల్లో సినిమా లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ తో ,మనోజ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.