టాలీవుడ్ కు శర్వానంద్ హీరోగా చేసిన 'రన్ రాజా రన్' సినిమా ద్వారా దర్శకుడిగా సుజీత్ పరిచయమయ్యాడు. ఫస్ట్ ఎటెమ్ట్ లోనే  ఆయన సక్సెస్ ను సాధించాడు. ఆ సినిమా సాధించిన సక్సెస్  కారణంగా, రెండవ సినిమానే ప్రభాస్ తో చేసే ఛాన్స్ దక్కింది. అలా ప్రభాస్ తో ఆయన 'సాహో' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించాడు.అయితే ప్రభాస్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.

యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో” భారీ అంచనాలతో  ప్రపంచవ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ అయ్యింది.  శ్రద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలే అనౌన్స్ చేసారు.  

స్టార్ హీరో కొత్త సినిమా ఫస్ట్ లుక్.. అతడి గట్స్ కి హ్యాట్సాఫ్!

కాని నమ్మిన వాళ్లు కనపడలేదు.   100 కోట్లు దాకా నష్టం వచ్చింది అన్నారు. ఈ నేఫధ్యంలో సాహో హిందీలో హిట్ అనిపించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం భారీ ఫ్లాప్ అయ్యింది.  కథ లేకుండా ఖర్చు పెట్టించాడనే విమర్శలు వినిపించాయి.

ఈ నేపధ్యంలో  ఈ కుర్ర దర్శకుడు నెక్ట్స్ ఏం చెయ్యబోతున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. అనేక విమర్శల తర్వాత మీడియాకు దూరంగా ఉండిపోయిన సుజీత్... కొంత గ్యాప్ తీసుకుని శర్వానంద్ కోసం ఓ కథను సిద్ధం చేశాడట. ఈ వారంలోనే ఆయన ఆ కథను శర్వానంద్ కి వినిపించనున్నాడని అంటున్నారు. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సుజీత్ నెక్ట్స్ సినిమా ఆయనతోనే ఉంటుంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.