బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా కమర్షియల్ చిత్రాలు చేస్తే వసూళ్లు వస్తాయి. కానీ అమిర్ ఖాన్ నటించే ప్రయోగాత్మక చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తుంటాయి. ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో అమిర్ నటించిన చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. 

వైవిధ్య భరితమైన కథలు ఎంచుకుని.. ఆ పాత్రల్లోకి అమీర్ పరకాయ ప్రవేశం చేస్తాడు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో అమిత్ విభిన్నమైన కథలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా అమిర్ ఖాన్ మరోసారి అభిమానులని సర్ ప్రైజ్ చేశాడు. 

అమిర్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. అమిర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. మరోసారి అమిర్ ఖాన్ డీగ్లామర్ లుక్ లో అదరగొట్టాడు. పొడవుగా పెరిగిన గడ్డం, మీసాలు.. సిక్కుల గెటప్ లో అమిర్ ఖాన్ అదరగొట్టాడు. లాల్ సింగ్ చద్దా చిత్రం హాలీవుడ్ క్లాసిక్ మూవీ 'ఫారెస్ట్ గంప్' ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. 1994లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కానీ అమిర్ ఖాన్ ని తక్కువగా అంచనా వేయలేం కదా. 

అమిర్ ఖాన్ గత ఏడాది నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తీవ్రంగా నిరాశపరిచింది. బయ్యర్లు ఈ చిత్రంతో నష్టపోయారు. దీనితో లాల్ సింగ్ చద్దా మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అమిర్ ఖాన్ సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 3 ఇడియట్స్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి ఈ చిత్రంలో రొమాన్స్ చేయబోతున్నారు.