సుడిగాలి సుధీర్ కి, యాంకర్ రష్మికి మధ్య ఎఫైర్ నడుస్తుందని.. వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ అమ్మాయిలను బాగా ఫ్లర్ట్ చేస్తుంటాడని ఆ కారణంగానే అతడికి పెళ్లి జరగడం లేదనే రూమర్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. సాధారణంగా ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని సుధీర్ పుకార్లు శ్రుతిమించుతుండడంతో తాజాగా ఈ విషయంపై స్పందించాడు. 

రష్మితో ఎఫైర్ నడుపుతున్నాననే విషయంలో అర్ధం లేదని.. వేరే అమ్మాయిలతో కూడా తనకు ఎలాంటి రిలేషన్ లేదని.. తను అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తాననే విషయంలో నిజం లేదని అన్నారు. నిజంగానే తను ఎవరితోనైనా ఎఫైర్ ఉండి ఉంటే బయట ఎక్కడైనా తిరుగుతూ మీడియాకి చిక్కేవాడిని కదా అని అన్నారు.

ఈ నాలుగేళ్లలో సుధీర్ కి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయనే మాటలు వినిపించాయే తప్ప.. సుధీర్ పలానా అమ్మాయితో ఇక్కడ ఉన్నాడని ఎక్కడైనా వచ్చిందా..? అని ప్రశ్నించాడు. తను చాలా రిజర్వ్డ్ గా ఉంటానని.. అమ్మాయిలతో పెద్దగా మాట్లాడనని చెప్పారు. ఇండస్ట్రీలో ఈ విషయం గురించి ఎవరిని అడిగిన చెబుతారని అన్నాడు. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉండడం, తమ్ముడితో కలిసి పబ్ కి వెళ్లడం తప్ప తన లైఫ్ లో ఇంకేం జరగడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

కానీ రూమర్స్ మాత్రం వస్తూనే ఉంటాయని మండిపడ్డారు. ''సుధీర్-రష్మి లిప్ లాక్ అంటారు. అందులో సుధీర్ ఉండడు.. రష్మి ఉండదు. సుధీర్, రష్మి హోటల్‌లో దొరికారు అంటారు. అందులో సుధీర్ ఉండడు, రష్మి ఉండదు.ఇంకేదో అంటారు. నిజంలో ఏదీ ఉండదు. నా ఫోన్ ఇస్తా కావాలంటే ట్రాక్ చేసుకోండి'' అని ఫైర్ అయ్యారు. తను లవ్ ఫెయిల్యూర్ అని.. అందుకే అమ్మాయిలన్నా, ప్రేమ అన్నా ఇష్టముండదని చెప్పారు. 

నేను ప్రేమించిన అమ్మాయి వేరొకడితో.. సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీ!