'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాడు సుడిగాలి సుధీర్. అతడి కామెడీ టైమింగ్ కి జనాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. త్వరలోనే తను నటించిన మొదటి సినిమా విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా.. సుధీర్ అనగానే అందరికీ రష్మి కూడా గుర్తొస్తుంటుంది.

'ఢీ' షోలో వీరిద్దరి కాంబినేషన్ హైలైట్ అనే చెప్పాలి. బుల్లితెరపై వీరిది హిట్ పెయిర్ కావడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన సుధీర్ తనకు ఏ అమ్మాయితో ఎఫైర్ లేదని స్పష్టం చేశాడు. తను లవ్ ఫెయిల్యూర్ అని, అందుకే అమ్మాయిలంటే నచ్చదంటూ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.

'జబర్దస్త్' షోకి రాకముందు సుడిగాలి సుధీర్ ఓ అమ్మాయిని ప్రేమించాడట. ఐదవ తరగతి నుండే ఆమె అంటే సుధీర్ కి ఇష్టమట. తొమ్మిదో తరగతిలో ఆమెకి  విషయాన్ని చెబితే తన లవ్ ని యాక్సెప్ట్ చేసిందని.. కొన్నాళ్లపాటు తమ ప్రేమ బాగానే సాగిందని చెప్పాడు సుధీర్. అయితే సడెన్ గా తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకడిని లవ్ మ్యారేజ్ చేసుకుందని చెప్పుకొచ్చాడు సుధీర్.

జాబ్ కోసం ఆ అమ్మాయికి దూరంగా ఫిల్మ్ సిటీకి వచ్చినప్పుడు ఆమె తన క్లాస్ మేట్ ని ప్రేమించడం మొదలుపెట్టిందని.. ఈ విషయం తనకు తెలిసినా నమ్మలేదని సుధీర్ తెలిపారు. పన్నెండేళ్లు ప్రేమించిన అమ్మాయి అలా చేయదనుకున్నానని.. కానీ సడెన్ గా తనకు హ్యాండ్ ఇచ్చి వేరేవాడ్ని పెళ్లి చేసుకుందని ఎమోషనల్ అయ్యాడు. అప్పటినుండి ప్రేమించడం మానేశానని.. అమ్మాయిల జోలికి కూడా వెళ్లడం లేదని చెప్పుకొచ్చాడు.