టాలీవుడ్ టాప్ కామెడీ షో జబర్దస్త్ తో తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్బంగా సుదీర్ మాట్లాడుతూ.. పదేళ్ల క్రీతం హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ముందు నుంచి వెళుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చేది,. మనల్ని అసలు గేటు లోపలికైనా రానిస్తారా? లేదా ? అనుకునేవాన్ని. కానీ ఇప్పుడు నా మొదటి సినిమా ప్రెస్ మీట్ ఇక్కడే జరగడం చాలా ఆనందంగా ఉంది.

నేను ఇక్కడికి రావడానికి మా అమ్మానాన్నల ఆశీర్వాదంతో పాటు దేవుడి దయ కూడా ఉందని సుదీర్ వివరణ ఇచ్చాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని సినిమాలో తనకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ - రజినీకాంత్ వంటి స్టార్స్ ని అనుకరించినట్లు చెప్పాడు.

ఇక హీరోయిన్ ధాన్యా బాలకృష్ణ మాట్లాడుతూ.. కొంతమంది హీరోలకు నాలుగైదు సినిమాలు చేశాక క్రేజ్ వస్తుంది. కానీ సుధీర్ ఆల్రెడీ క్రేజ్ తెచ్చుకుని హీరో అయ్యాడు. అందుకే తిరిగి మళ్ళీ ఈ సినిమా చేస్తానని నిర్మాతలకు చెప్పా. సుధీర్ హీరో కాకముందే అంతటి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాడికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు అని ధన్య బాలకృష్ణన్ కామెంట్స్ చేసింది.

read also: అందుకే బిగ్ బాస్ ఒప్పుకోలేదు.. రష్మి, సుధీర్ పెళ్లిచేసుకోరు.. గెటప్ శ్రీను కామెంట్స్

సోషల్ మీడియాలో సుధీర్ అభిమానులు సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాపై చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ధన్య ఆశాభావం వ్యక్తం చేసింది. రాజశేఖర్ రెడ్డి గారికి ఇది డెబ్యూ మూవీ. అయినా కూడా ఆయన మంచి అనుభవం ఉన్న కమర్షియల్ దర్శకుడిలా ఈ చిత్రాన్ని రూపొందించారు అని ధన్య ప్రశంసించింది.