‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.  మొదటి సినిమాతోనే నంది అవార్డ్ గెలుచుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాత సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయాడు. చివరగా తెలుగులో 'ఒంగోలుగిత్త' సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తూండటంతో ఈ సినిమాపై ఆసక్తిని పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందా..అల్లు అరవింద్ ని, అఖిల్ ని మెప్పించే స్టోరీ లైన్ ఏమిటి అనేది ఇండస్ట్రీలో చర్చ  జరుగుతోంది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ సినిమా వివాహం, దాని ప్రాధాన్యత చుట్టూ తిరగనుంది. అఖిల్ ..అమెరికానుంచి వచ్చిన ఎన్నారై. ఇక్కడ అమ్మాయి ని పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకుంటాడు. తనకు తగ్గ అమ్మాయిని వెతకటం మొదలెడతాడు. ఈ క్రమంలో అతనికి అర్దమయ్యే విషయం...వివాహం అంటే ఓ అమ్మాయిని చేసుకోవటం కాదని, కొన్ని భాధ్యతలతో ముందుకు వెళ్లటం అని అర్దమవుతుంది. పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా నడిచే ఈ సినిమా ఫన్ ఎంటర్టైనర్ గా భాస్కర్ తీర్చిదిద్దుతున్నారు. హీరో,హీరోయిన్స్ క్యారక్టరైజేషన్స్ స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

'అల వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్స్.. నిజమేనా?

 హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమెయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు. అయితే పూజా హెగ్డేకు పెద్దగా స్టాండప్ కామెడీలపై పెద్దగా అవగాహన లేదట. యుట్యూబ్ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేద్దామనుకుంది కానీ..అది కష్టం అనిపించి కొంతమంది స్టాండప్ కమెడియన్స్ ని కలుస్తూ ట్రైనింగ్ తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని,కొద్దిగా కష్టమనిపించినా తనకు మంచి పేరు వస్తుందని రాత్రింబవళ్లూ కష్టపడుతోందట.
 
 అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలై జరుగుతోంది.