టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ మహేష్ సినిమాలు ఒకేసారి సంక్రాంతి సీజన్ లో పోటీ పడుతున్నాయి. అల.. వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండు కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యాయి.

ప్రస్తుతం రెండు సినిమాలకు అన్ని ఏరియాల నుంచి కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. అల్లు అర్జున్ సినిమా అల.. వైకుంఠపురములో మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ పై చిత్ర యూనిట్ 85కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని చూపిస్తోంది. ఇక మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు 50కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.

అయితే బన్నీ సినిమా కలెక్షన్స్ పోస్టర్ పై ఓ వర్గం ఆడియెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  నిజంగా సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందా? అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి యూఎస్ ప్రీమియర్స్ తో మహేష్ సినిమాకు మంచి పోటీని ఇచ్చిన అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు రాబట్టాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. 85కోట్ల గ్రాస్ అంటే సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాగా టాప్ లోకి రావడం పక్కా కానీ. ఈ కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో  ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేస్తున్నారు.

నవదీప్ కోసమే మా ఆవిడ ప్యారిస్ వచ్చింది : త్రివిక్రమ్!