మంచు మనోజ్ తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. మీడియాలో ఎప్పటినుండో నలుగుతున్న ఈ విషయంలో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు మంచు మనోజ్. రెండేళ్లుగా వీరు సఖ్యతగా లేకపోవడంతో పలు సందేహాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నాడు. కానీ తాజాగా మనోజ్ తన భార్యతో విడిపోతున్నట్లు తేల్చి చెప్పాడు.

అసలు విషయం ఇంతవరకు ఎందుకు వచ్చిందంటే.. మనోజ్ కి 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ పెళ్లి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ప్రణతి-మనోజ్ ల పరిచయం జరిగింది. మొదట ప్రణతినే మనోజ్ దగ్గరకు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. అయితే అప్పట్లో మోహన్ బాబు, ఇతర కుటుంబసభ్యులు పెళ్లికి నో చెప్పారు. కానీ మనోజ్ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారట.

ఆ తరువాత ఉద్యోగం కారణంగా ప్రణతి అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండడం, మనోజ్ ఆ సమయంలో సినిమాలతో బిజీగా ఉండడంతో ఇద్దరోకీ కలిసి గడిపే సమయం దొరికేది కాదట. అదే ప్రణతికి పెద్ద కంప్లైంట్. మనోజ్ కి ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేయడం నచ్చేది కాదట. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని సమాచారం. మధ్యవర్తులు ఎంత ప్రయత్నించినా.. ఇద్దరి మధ్య మునుపటి బంధం ఏర్పడేలా చేయలేకపోయారు. 

మంచు మనోజ్ విడాకులు.. వైరల్ అవుతోన్న పాత ట్వీట్!

కాకపోతే.. ఒకప్పటి స్నేహాన్ని మాత్రం ఇద్దరూ కంటిన్యూ చేస్తున్నారు. ఇద్దరూ ఓ అభిప్రాయానికి వచ్చిన తరువాతే విడాకుల నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు మనోజ్ చేసిన ట్వీట్ కూడా ప్రణతికి చదివి వినిపించి.. ఆమె ఓకే చెప్పిన తరువాతే సోషల్ మీడియాలో పెట్టాడట. కలిసి గొడవపడుతూ బ్రతకడం కంటే, విడిపోయి ఎవరికి వాళ్లు సంతోషంగా ఉండడం మంచిదనే నిర్ణయానికి వచ్చిన తరువాత కోర్టుకి వెళ్లారు. ఈ గొడవల కారణంగా మంచు మనోజ్ సినిమాల మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు  చేస్తానని తన అభిమానులకు చెప్పాడు.