మంచు మనోజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్య ప్రణతితో మనోజ్ కలిసి ఉండడం లేదని.. ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మంచు మనోజ్ తన భార్య నుండి విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చాడు. రెండేళ్లుగా వీరి బంధానికి సంబంధించి కలుగుతోన్న అనుమానాలన్నీ నిజమేనని తేల్చేశాడు మంచుమనోజ్.

2017లో 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్.. ఆ తరువాత మరో సినిమానే చేయలేదు. కానీ కొత్త సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఈ రెండేళ్లలో తన భార్యతో కలిసి ఎక్కడా కనిపించకపోవడంతో జనాలకు సందేహాలు కలిగాయి. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగినప్పుడు కూడా మనోజ్ పక్కన అతడి భార్య లేదు. దీంతో మనోజ్ కి, ప్రణతికి మధ్య సఖ్యత లేదనే ప్రచారం జరిగింది.

 

తన భార్య నుండి మనోజ్ విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది ప్రచారం జరిగింది. దీనికి మీద మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఓ యూట్యూబ్ చానెల్ మనోజ్ విడాకుల గురించి ఓ స్టోరీ చేసి అప్లోడ్ చేయగా.. దీని గురించి కొంతమంది అభిమానులు ట్విట్టర్ లో మనోజ్ ని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా 'వాళ్ల బొంద' అని బదులిచ్చాడు మనోజ్. దీనిపై మరింత వివరణ ఇస్తూ విడాకుల వార్తలను ఖండించాడు. 

బ్రేకింగ్: భార్యతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్!

తను ప్రణతిని ఎంతగానో ప్రేమిస్తానని, జీవితాంతం తనను ప్రేమిస్తూనే ఉంటానని.. ఆమె ఎప్పుడూ తన గుండెల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అప్పట్లో అలా చెప్పిన మనోజ్ ఇప్పుడు విడాకుల వార్తలను నిజమని కన్ఫర్మ్ చేసిన నేపధ్యంలో పాత ట్వీట్ లన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మనోజ్ 'వాళ్ల బొంద' అని చేసిన ట్వీట్ ని చాలా మంది రీట్వీట్ చేస్తూ మనోజ్ ని ఇబ్బంది పెడుతున్నారు. వ్యక్తిగతంగా ఎంతో బాధను భరిస్తోన్న మనోజ్ ని ఈ రకంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.