అవకాసం వస్తే తన హాట్ అందాలతో రెచ్చిపోయే సంజన గుర్తుండే ఉండి ఉంటుంది.  కన్నడలో మర్డర్ రీమేక్ తో పాపులారిటీ సంపాదించుకుని... ఆ తర్వాత తెలుగు, మలయాళంలో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సంజన. ప్రభాస్ చేసిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల వచ్చిన దండుపాళ్యం సినిమాలో కూడా మంచి రోల్ పోషించింది.

ప్రస్తుతం స్వర్ణ ఖడ్గం అనే సీరియల్‌లో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి ఇంటికీ దగ్గరయ్యింది.  అలాంటి ఆమె ఇప్పుడు ఓ అడల్ట్ వెబ్ సీరిస్ లో నటిస్తోందని ప్రముఖ ఆగ్ల దిన పత్రికలో ద్వారా బయిటకు వచ్చిన సమాచారం. అదీ అల్లు అరవింద్ నిర్మాతగా.  ప్రస్తుతం వెబ్ సీరిస్ లు చేయటం అనేది ట్రెండ్ గా నడుస్తోంది. పెద్ద పేరున్న ఎస్టాబ్లిష్ అయిన ప్రొడక్షన్ హౌస్ లు సైతం ఈ వెబ్ సీరిస్ ల నిర్మాణంలోకి వచ్చేసాయి.

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

అలాగే అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సైతం వెబ్ సీరిస్ లపై దృష్టి పెట్టిందంటున్నారు. వైవా హర్ష ప్రధాన పాత్రలో నడిచే ఓ వెబ్ సీరిస్ కు అంకురార్పణ చేసిన ఈ సంస్ద, సంజన ను కూడా సీన్ లోకి తీసుకు వచ్చింది.   ఈ వెబ్ సీరిస్ మొత్తం అడల్డ్ కంటెంట్, జోక్స్ చుట్టూ సాగనుందని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఈ సీరిస్ ద్వారా పరిచయం కాబోతున్నారు.

సంజనకు ఇది తొలి వెబ్ సీరిస్. ఈ సీరిస్ నవ్విస్తుందని, కవ్విస్తుందని, ఇప్పటిదాకా తెరపై చూడని కాన్సెప్ట్ తో రాబోతోందని అంటున్నారు. మరో ప్రక్క హిందీలో సక్సెస్ అయిన లస్ట్ స్టోరీస్ తరహాలో ఈ వెబ్ సీరిస్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఏదైమైనా అల్లు అరవింద్ వంటి నిర్మాత నుంచి ఇలాంటివి ఊహించం.