తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది నయనతార. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డుల్లోకెక్కింది. ఇటీవల 'సైరా', 'బిగిల్' చిత్రాలతో విజయాలు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసిందని సమాచారం.

ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. దాన్ని తాజాగా రూ.8 కోట్లకి పెంచేసిందని సమాచారం. నయనతారకి ఉన్న క్రేజ్ తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఇలా తమ సినిమాల్లో నటించమని అడుగుతోన్న నిర్మాతలకు తన రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తోంది నయన్.

నాని, సురేష్ బాబులపై ఐటీ రైడ్స్.. శ్రీరెడ్డి సంతోషం!

ఆమె రెమ్యునరేషన్ పెంచేసినప్పటికీ కొందరు దర్శకనిర్మాతలు మాత్రం నయన్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారంటే ఆమెకి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆర్.జే.బాలాజీ రూపొందిస్తోన్న 'ముక్కుత్తి అమ్మన్' అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు, నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మొదట విఘ్నేశ్ ఈ సినిమా కథ గురించి నయనతారతో చర్చించినప్పుడు ఆమె వెంటనే దర్శకుడు ఆర్.జే.బాలాజీకి ఫోన్ చేసి తనకు కథ చెప్పమని అడిగిందట. అలా కథ చెప్పించుకొని మరీ సినిమాలో ఛాన్స్ అందుకుందని దర్శకుడు స్వయంగా చెప్పాడు. ఈ సినిమా కోసం ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయగా.. దానికి నిర్మాతలు అంగీకరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు  వినిపిస్తున్నారు.

భక్తిరస కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత ఐసరిగణేశ్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం నయనతార 'దర్బార్' సినిమాలో నటిస్తోంది. అలానే 'నెట్రికన్' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్న సినిమాలో కూడా నటించడానికి  ఒప్పుకున్నట్లు సమాచారం.