తెలుగు చిత్ర పరిశ్రమపై ఐటీ అధికారులు బుధవారం నాడు అకస్మాత్తుగా ఐటీ దాడులు నిర్వహించారు. ముందుగా రామానాయుడు స్టూడియోలో ఐటీ దాడులు మొదలయ్యాయి. ఆ తరువాత సురేష్ బాబు నివాసం, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో కూడా ఐటీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు.

ఆ తరువాత హీరో నాని, హారికా అండ్ హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఐటీ దాడులు జరిపారు. బుధవారం నాడు సాయంత్రం వరకు ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై సోదాలు నిర్వహించారు. ఈ ఐటీ దాడులపై నటి శ్రీరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా సురేష్ బాబు, నానికి సంబంధించిన ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ రైడ్స్ జరగడంతో శ్రీరెడ్డి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

హీరో వెంకటేష్ ఇంటిపై ఐటీ అధికారుల అటాక్.. ఈరోజంతా కొనసాగే అవకాశం!

ఈరోజు  కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని.. దేవుడు ఉన్నాడు అంటూ వరుస పోస్ట్ లు పెట్టింది. ఎవరి కర్మకి వారే బాధ్యులని తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది. శ్రీరెడ్డి ఇంతగా ఆనందపడడానికి కారణం తెలిసిందే.. సురేష్ బాబు చిన్నకొడుకు అభిరామ్ తనను మోసం చేశాడని గతంలో శ్రీరెడ్డి ఆరోపించింది.

ఈ ఆరోపణలతోనే ఆమె పాపులర్ అయింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టింది. అభిరామ్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలపై ఆమె ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో నానిని టార్గెట్ చేస్తూ కొన్ని అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టింది. నాని ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నాడని, అతడొక కామాంధుడు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది.

ఈ విషయాలను నాని ఖండించాడు కానీ శ్రీరెడ్డి మాత్రం నానిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు అదే సురేష్ బాబు, నాని ఇళ్లల్లపై ఐటీ దాడులు జరగడంతో శ్రీరెడ్డి పొంగిపోయింది. తనకు అన్యాయం చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారనడానికి తాజాగా జరిగిన ఐటీ దాడులే ఉదాహరణ అని చెప్పుకొచ్చింది.