Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మానందం చేతుల్లో రూపుదిద్దుకున్న అయోధ్య రామయ్య... ఆంజనేయుని ఆనందబాష్పాలు

 ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం కూడా తన చేతులతో రామాంజనేయుల అద్భుత పెయింటింగ్ వేసి శ్రీరాముడిపై తన భక్తిని చాటుకున్నారు. 

star comedian bramhanandam special painting on ayodya ramaiah
Author
Hyderabad, First Published Aug 5, 2020, 8:40 PM IST

హైదరాబాద్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా యావత్ దేశంలో రామనామస్మరణ మారుమోగింది. రాజకీయ నాయకులతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులు సైతం అయోధ్య రామయ్యను ఏదో ఒక రూపంలో స్మరించుకున్నారు. ఇలా ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం కూడా తన చేతులతో రామాంజనేయుల అద్భుత పెయింటింగ్ వేసి శ్రీరాముడిపై తన భక్తిని చాటుకున్నారు. 

అయితే కేవలం రామాంజనేయుల పెయింటింగ్ మాత్రమే కాదు అందులో ఓ అంతరార్థాన్ని కూడా వుంచారు. ఈ అయోధ్య రామమందిర  నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా శ్రీరాముని ప్రియభక్తుడు ఆంజనేయుడు ఆనందబాష్పాలు రాలుస్తున్నట్లు వుంది. ఇలా తన భావాలను హనుమంతుడి రూపంలో పలికించారు కమెడియన్ బ్రహ్మానందం. 

read more  అయోధ్య చరిత్రలో బాబ్రీ ఉండి తీరుతుంది: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబేన్ పాటిల్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 29 ఏళ్ల తర్వాత అయోధ్యలో బుధవారం నాడు అడుగుపెట్టాడు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాతే పవిత్రమైన అయోధ్యలో అడుగుపెడుతానని మోడీ 1992లో ప్రకటించారు. అప్పటి నుండి ఆయన అయోధ్యలో అడుగుపెట్టలేదు.

29 ఏళ్ల క్రితం అయోధ్యలో మోడీ పర్యటించిన సమయంలో మోడీ తిరంగా ర్యాలీ కన్వీనర్ గా ఉన్నాడు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ  తిరంగా ర్యాలీని బీజేపీ చేపట్టింది. బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ ఈ ర్యాలీని చేపట్టారు.

 ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ , కాశ్మీర్ లను  కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసి ఏడాదైంది. గత ఏడాది ఫైజాబాద్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. కానీ, ఆయన అయోధ్యను సందర్శించలేదు.

అయోధ్యను సందర్శిస్తున్న మొట్ట మొదటి ప్రధానమంత్రి మోడీయేనని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాముడు పుట్టిన ప్రాంతంగా అయోధ్యను భావిస్తారు. అంతేకాదు హనుమంతుడి మందిరం హనుమాన్ ఘరిని సందర్శించిన మొదటి  ప్రధాని కూడ మోడీయేనని యూపీ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. 

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని 1990లో మోడీ దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన వారిలో ప్రముఖుడు. 16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆయన అప్పట్లో ప్రచారం నిర్వహించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios