ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా అకౌంట్ ని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉంటారు. ఆయన ఏం చెప్పినా, మాట్లాడినా దానికొచ్చే రెస్పాన్సే వారు. ఈ క్రమంలో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన వాళ్లు అనుకున్న వారి చిన్న సినిమాలకు తనదైన శైలిలో ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. ఓ రకంగా సినిమా రివ్యూలలాగ ఆయన రాసి బూస్టప్ ఇస్తూంటారు. అయితే ఆ రివ్యూలు ఆ మధ్యన ట్రోలింగ్ కు గురి అయ్యాయి. దాంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. తాజాగా తన సోదరుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా రూపొందిన 'మత్తు వదలరా' చిత్రానికి మరోసారి రివ్యూలాంటి ప్రమోషన్ ని చేసారు.

'మత్తు వదలరా' ప్రీమియర్ షో టాక్.. కీరవాణి తనయుల చిత్రం ఎలా ఉందంటే!

నిన్న రాత్రి మత్తువదలరా చిత్రానికి హైదరాబాద్ లో  స్పెషల్ ప్రీమియర్ వేసారు. చాలా మంది సినిమా సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ సినిమా చూసిన రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ... “నా మనస్సు మొత్తం ఈ సినిమా చుట్టూనే తిరుగుతోంది. నేను చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాను. ఇంతకు ముందు ఈ సినిమా చూసాను.

అయితే అప్పటికి విఎఫ్ ఎక్స్  వర్క్, రీరికార్డింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరైతే థ్రిల్లర్స్ ఇష్టపడతారో వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుచంది. చివరి ఫ్రేమ్ దాకా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేసారు. నా బిడ్డల ను చూసి నేను గర్వపడుతున్నాను. నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నాను. మీ హానెస్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు రాజమౌళి.  
 
శ్రీ సింహ హీరోగా రితేష్‌ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా’.  నరేష్‌ అగస్త్య, వెన్నెల కిశోర్‌, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. రితేష్‌ రాణా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈరోజు డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.