ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. గతం లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నానా హడావిడి చేసి చివరికి ఓ బడా హీరో పై కామెంట్ చేయడంతో  ఆహీరో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై టాలీవుడ్ కు టాటా చెప్పింది. ప్రస్తుతం కోలీవుడ్ లోకి వెళ్లి అక్కడే  అడపాదడపా సీరియళ్లు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుంది. అయితే ఆమధ్య కొంచెం గ్యాప్ తీసుకున్న శ్రీ రెడ్డి ఇటీవల మళ్ళీ కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ అసభ్యకర పదజాలం తో పోస్ట్ లు పెడుతుంది. 
 
అందులో భాగంగా  కొద్దీ రోజుల క్రితం రాకేష్ మాస్టర్ , కళ్యాణి లను తీవ్ర పదజాలంతో దూషిస్తూ పేస్ బుక్  లో పోస్ట్ లు చేసింది దాంతో  రాకేష్ మాస్టర్  ఆమె పై కేసు కూడా పెట్టారు అయినా కూడా ఏమాత్రం బెదిరిపోకుండా తన చెప్పాలనుకున్న విషయాన్ని పేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఇటీవల నాని నిర్మించిన హిట్ సినిమా విడుదల సమయంలో...  నూని గాడి హిట్టు పట్ అంటూ పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఛార్మి లను టార్గెట్ చేసింది.  గత కొంత కాలంగా నటన కు  దూరంగా వుంటూ పూరి తో  కలిసి సినిమాలను నిర్మిస్తుంది  ఛార్మి. అయితే వీరిద్దరి సాన్నిహిత్యం గురించి  అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి. అయినా కూడా వీరిద్దరి బంధం కొనసాగుతూనే వుంది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్  హిట్ కొట్టిన వీరిద్దరూ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో  ఫైటర్ అనే సినిమా ను నిర్మిస్తున్నారు. 
 
ఇదిలావుంటే శ్రీ రెడ్డి ఇప్పుడు వీరిద్దరి ని టార్గెట్ చేసింది. తన పేస్ బుక్ ఖాతా లో 'చార్మింగ్ పూరి' అంటూ  పోస్ట్ చేసింది ఇక  దీని పై  నెటిజన్లు తమ దైన శైలి లో స్పందిస్తున్నారు.  వారిద్దరూ ఎటు వెళ్తే నీకెందుకు  నీ పని నువ్వు చేసుకో అని అలాగే ఏం వారి మధ్య కు నువెళ్తావా ? అంటూ ఇలా రకరాల కామెంట్లు పెడుతున్నారు.  ప్రస్తుతం శ్రీ రెడ్డి పేస్ బుక్ ఖాతా ను 60 లక్షలకు మందికి పైగా ఫాలో అవుతున్నారు.  అయితే అందరికి తెలిసిన విషయాన్నే చెప్పి  శ్రీ రెడ్డి ఇప్పుడు రచ్చ చేయాలనుకోవడానికి  కారణం ఏంటో.. 

వరల్డ్ కప్ ఫైనల్ లో ఎన్టీఆర్ మాస్ సాంగ్.. స్టేడియం మోతెక్కింది!