టాలీవుడ్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. కెరీర్ ఆరంభంలో నందమూరి ఫ్యాన్స్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. క్రమంగా తన నటన, డాన్సులు, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో తెలిపేలా ఇటీవల ఓ సంఘటన జరిగింది. ఆదివారం రోజు ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరిగిన ఉమెన్స్ టి 20 వరల్డ్ కప్ ఫైనల్ కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. 

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఇది పక్కన పెడితే.. స్టేడియంకు భారత అభిమానులు ఒక రేంజ్ లో హాజరయ్యారు. బ్రేక్ సమయంలో స్టేడియంలో వినిపించిన పాటల్లో 'పక్కా లోకల్' సాంగ్ కూడా ఉంది. 

ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలోని ఈ సాంగ్. ఈ పాట వినిపించగానే స్టేడియంలోని ఎన్టీఆర్ అభిమానులు రచ్చ రచ్చ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

ఎన్టీఆర్ చిన్న కొడుకుపై హరీష్ కామెంట్స్.. వదిలితే దూకేస్తాడు!

ఎన్టీఆర్ ఫ్యాన్స్  సంతోషానికి అయితే అవధులు లేవు. ఎన్టీఆర్ క్రేజ్ అంటే ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు పోస్ట్ చేసిన ఈ ట్విట్టర్ పోస్ట్ ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా లైక్ చేశాడు. కాజల్, ఎన్టీఆర్ కలసి పక్కా లోకల్ అంటూ వేసిన మాస్ స్టెప్పులు అభిమానులని ఉర్రూతలూగించాయి.