టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై చేరిన పోరాటం ద్వారా నటి శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డి సృష్టించిన సంచలనం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మీడియాలో కూడా శ్రీరెడ్డి అనేక సంచలన విషయాలు బయటపెట్టింది. 

ఆ తర్వాత కూడా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో నటి కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసింది. 

తాను ఈ మధ్యన సైలెంట్ గా ఉంటున్నందున కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లాంటి వ్యక్తులు రెచ్చిపోతున్నారని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. నటి కరాటే కళ్యాణి గురించి నాకు బాగా తెలుసు. ఆమెకు ఎంతమంది మొగుళ్ళో కూడా తెలుసు. మీ మాజీ మొగుడు నా దగ్గరకు వచ్చి నీ గురించి అంతా చెప్పాడు. నువ్వు ఎవరిదగ్గర ఏమేం చేసావో నాకు తెలుసు అని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. 

పేర్కొనలేని భాషలో శ్రీరెడ్డి బూతుపురాణం మొదలు పెట్టింది. తాను వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నందువల్లే వీళ్లంతా తనని టార్గెట్ చేస్తున్నారని శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం తాను తన చిత్రాలతో, వర్క్ తో బిజీగా ఉన్నన్నానని.. తనని కెలకవద్దని శ్రీరెడ్డి కరాటే కళ్యాణికి, రాకేష్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చింది. 

చిరంజీవి, సురేఖ పెళ్లి చూపులు అలా జరిగాయి.. మెగాస్టార్ అహం దెబ్బతినిందట!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కు షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్.. నోటీసులు ?