ఇటీవల నటి మాధవీలత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రేమ' సినిమాలో రేవతిలా తాను కూడా చచ్చిపోతానని పేర్కొంది. ఆ సినిమాలో రేవతి ఎప్పుడూ ఏదొక మెడిసిన్ వేసుకుంటూ.. ఆఖరికి ఎలాంటి మెడిసిన్ తనపై పని చేయకుండా చనిపోతుంది. తాను కూడా అంతేనేమోనంటూ విచారం వ్యక్తం చేసింది. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి ఎప్పుడూ తనను ఏడిపిస్తాయని చెప్పింది.

తనకు మందులంటే చాలా అసహ్యమని.. కానీ మందులు వాడాల్సివస్తుందని చెప్పుకొచ్చింది. తనకు కలలు, కోరికలు, ఆశలున్నాయని.. కానీ ఈ మందులు తన ఆయుష్షు ఉంచవేమోనని వెల్లడించింది.

ఆ సినిమాలో హీరోయిన్ లా చచ్చిపోతా.. మాధవీలతా కామెంట్స్!

సమస్యలు చిన్నవే అయినా.. ఎక్కువ కాలం మందులు వాడాల్సివస్తుందని.. దీని కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నాని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మాధవీలతా మరోసారి స్పందించక తప్పలేదు. తను చనిపోవడం లేదని.. అంత జబ్బు తనకు లేదని.. చావు మీద ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ మరో పోస్ట్ పెట్టింది.

అయితే నటి శ్రీరెడ్డి మాత్రం మాధవీలతా చావుపై సోషల్ మీడియాలో జోక్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. 'RIP మాధవీలత.. హో సారీ.. ఇంకా పోలేదు' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో మాధవీలత చావు ఇష్యూ మరింత రచ్చగా మారింది. శ్రీరెడ్డి పోస్ట్ చూసిన కొంతమంది బాగా చెప్పావ్.. అంటూ కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం 'నువ్ చచ్చిపో దరిద్రం వదిలిపోతుంది' అంటూ తిడుతున్నారు. శ్రీరెడ్డికి ఇలాంటి తిట్టు కొత్తేమీ కాదు కాబట్టి ఆమె ఈ విషయాలను పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు.