'ప్రేమ' సినిమాలో హీరోయిన్ రేవతిలా తను కూడా చచ్చిపోతానని చెబుతోంది నటి మాధవీలతా. 'నచ్చావులే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం రాజకీయాల్లో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. గతంలో కాస్టింగ్ కౌచ్ విషయంపై స్పందించి ఓ దర్శకుడు తనను ఇబ్బంది పెట్టాడని చెప్పింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. గురువారం అర్ధరాత్రి 'ప్రేమ' సినిమాలో రేవతిలా తాను కూడా చచ్చిపోతానని పేర్కొంది. ఆ సినిమాలో రేవతి ఎప్పుడూ ఏదొక మెడిసిన్ వేసుకుంటూ.. ఆఖరికి ఎలాంటి మెడిసిన్ తనపై పని చేయకుండా చనిపోతుంది.

మాంచి కసి మీద ఉన్నావ్, బ్రా వేసుకొని తిరుగుతున్నావ్.. శ్రీముఖి డ్రెస్ పై హాట్ కామెంట్స్

తాను కూడా అంతేనేమోనంటూ విచారం వ్యక్తం చేసింది. తను ఎప్పుడూ ఏడిపించే మూడు విషయాలున్నాయని.. వాటి కోసం మందులు వాడుతున్నానని కానీ అవి తన ఆయుష్షును పెంచవేమోనని అంటోంది మాధవీలతా. మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి ఎప్పుడూ తనను ఏడిపిస్తాయని చెప్పింది.

తనకు మందులంటే చాలా అసహ్యమని.. కానీ మందులు వాడాల్సివస్తుందని చెప్పుకొచ్చింది. తనకు కలలు, కోరికలు, ఆశలున్నాయని.. కానీ ఈ మందులు తన ఆయుష్షు ఉంచవేమోనని వెల్లడించింది.

సమస్యలు చిన్నవే అయినా.. ఎక్కువ కాలం మందులు వాడాల్సివస్తుందని.. దీని కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నాని చెప్పుకొచ్చింది. ఆరోగ్యమే.. మహాభాగ్యమని కానీ తన విషయంలో అది కరెక్ట్ కాదని అన్నారు.