టాలీవుడ్ లో వర్మ సంచలన దర్శకుడు. వర్మ చేసే కామెంట్స్, అతడి చిత్రాలు తప్పనిసరిగా వివాదాలు సృష్టిస్తుంటాయి. ఎలాంటి విషయం గురించి అయినా వర్మ బెదురులేకుండా తన మనసులో అభిప్రాయాన్ని చెబుతుంటాడు. ఇక ఇటీవల టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. 

కాస్టింగ్ కౌచ్ వ్యవహారం, పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో శ్రీరెడ్డి సంచలనంగా నిలిచింది. అప్పటి నుంచి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి రాంగోపాల్ వర్మ గురించి ఫన్నీ కామెంట్స్ చేసింది. 

కంటతడి పెట్టిన హీరోయిన్.. కాళ్లపై పడ్డ ఆర్జీవీ

రాంగోపాల్ వర్మ పర్యవేక్షణలో బ్యూటిఫుల్ చిత్రం తెరకెక్కింది. అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం న్యూఇయర్ సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో వర్మ హీరోయిన్ తో కలసి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

తమన్నా టార్చర్ తట్టుకోలేకపోతున్నా.. శ్రీరెడ్డి!

నైనా గంగూలీతో కలసి వర్మ చేసిన రొమాంటిక్ డాన్స్ ఇప్పటికే సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా మరోమారు వర్మ హీరోయిన్ తో వింతగా ప్రవర్తించాడు. హీరోయిన్ కాళ్ళు పట్టుకున్నాడు. దీనిపై శ్రీరెడ్డి ఫన్నీగా కామెంట్స్ చేసింది. రాంగోపాల్ వర్మ నన్ను దేవత అని పొగిడారు. నా కాళ్ళు పట్టుకుంటా అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మరో హీరోయిన్ కాళ్ళు పట్టుకున్నారు. ఆయన నన్ను చీట్ చేశారు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.