విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలో హాట్ టాపిక్ గా మారాడు. తన నుంచి ఏదైనా సినిమా వస్తోంది అంటే చాలు ప్రమోషన్స్ డోస్ ఒక్కాసారిగా పెంచేస్తున్నాడు. వర్మ ప్రొడక్షన్ లో తెరకెక్కిన బ్యూటీ ఫుల్ సినిమా ఈ న్యూ ఇయర్ కి విడుదల కాబోతోంది. సినిమాకు సంబందించిన పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హీటెక్కుతున్నాయ్.

ఇక దానికి తోడు వర్మ చేస్తున్న హంగామా మాములుగా లేదు. హీరోయిన్ కాళ్లపై పడిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అగస్త్య మంజు డైరెక్షన్ లో రూపొందిన బ్యూటిఫుల్ సినిమాను రంగీలా ట్రై బ్యూటీ అంటూ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆదివారం ప్రమోషన్స్ లో భాగంగా వర్మ న్యూ ఇయర్ ప్రీ పార్టీని గ్రాండ్ గా నిర్వహించాడు. పైగా సోషల్ మీడియా ద్వారా పార్టీని లైవ్ టెలిక్యాస్ట్ చేశాడు.

పార్టీలో చిత్ర యూనిట్ తో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ నైనా గంగూలీ తో స్పెషల్ గా స్టెప్పులేశాడు. ఇక ఎవరు ఊహించని విధంగా ఆమె కాళ్లపై పడ్డాడు. దీంతో నైనా భావోద్వాగానికి గురైనది. అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో వర్మ కుటుంబ సభ్యులు ప్రముఖ సినీ తారలు కూడా పాల్గొన్నారు. మరీ ఇంతగా రచ్చ చేస్తున్న వర్మ ఆ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు