టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ పలువురు సినీ ప్రముఖుల మీద ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటోంది. ఛాన్స్ దొరికిన ప్రతీసారి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఉంటోంది. ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటోంది.

టాలెంటెడ్ నటీనటుల కోసం నిర్మాతగా మారే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వివాదాస్పద నటి పేరుతో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సినిమా వస్తోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక.

మహేష్ ని కొట్టడానికి చేతులు రాలేదు.. విజయశాంతి కామెంట్స్!

న్యూఇయర్‌ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమా టైటిల్‌ కాస్త వెరైటీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది.

ఒక అమ్మాయి చేతిలో కత్తి, ఆమె ముఖంపై రక్తపు మరకలు చూస్తూంటే ఇదొక రివెంజ్ స్టోరీలా అనిపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు.