యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీగా గడుపుతున్న సమయంలో 'బిగ్ బాస్' షోలో కంటెస్టంట్ గా ఛాన్స్ రావడంతో ఆ షోకి వెళ్లింది శ్రీముఖి. షో మొదలైన కొద్దిరోజులకే స్టార్ మా యాజమాన్యం ఆమెని విజేతగా నిలబెట్టాలని చూస్తుందనే విషయం జనాలకు అర్ధమైంది.

హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెలో నెగెటివిటీ ఎంతమాత్రం చూపించకుండా ఉండడానికి షో డైరెక్టర్లు, ఎడిటర్లు చాలానే కష్టపడ్డారు. అయితే వారిని మెప్పించిన విధంగా శ్రీముఖి జనాలను మెప్పించలేకపోయింది. ఆమెకు తక్కువ ఓట్లు పడడంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా చేసేదేమీ లేక రాహుల్ కి ట్రోఫీ అందించారు.

సినిమా రిలీజ్ తరువాత పెళ్లి ప్రకటన చేస్తా.. హీరో కామెంట్స్!

శ్రీముఖి క్రేజ్ తగ్గకూడదని ఆమెకి సెకండ్ ప్లేస్ వచ్చినట్లుగా చూపించారు. కానీ శ్రీముఖికి అన్ని ఓట్లు రాలేదనే టాక్ బాగా ఉంది. షోకి వెళ్లకముందే ఆమెతో పలు ప్రోగ్రామ్స్ కి కాంట్రాక్ట్ రాయించుకున్న స్టార్ మా ఇప్పుడు ఆ పనిలో పడింది. 'బిగ్ బాస్' షో ముగిసిన తరువాత తన స్నేహితులతో కలిసి విహారయాత్రకి వెళ్లి వచ్చిన శ్రీముఖి త్వరలోనే స్టార్ మాలో కొత్త ప్రోగ్రాంలో కనిపించబోతుంది.

బిగ్ బాస్ షోలో తన అరుపులు, కేకలతో తనకొచ్చిన ఎంటర్టైన్మెంట్ చూపించిన శ్రీముఖి తన కొత్త షో ప్రోమోలో కూడా అదే చేసింది. షో మొత్తం కూడా ఇలానే అరుపులతో రచ్చ చేసేలా ఉంది. బిగ్ బాస్ షో కారణంగా పాపులారిటీ పెరిగిన సంగతి పక్కన పెడితే.. తనకున్న ఇమేజ్ కి కాస్త డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి.

నిజానికి ప్రేక్షకుల్లో శ్రీముఖిని హేట్ చేసే వారు పెద్దగా ఉండేవారు కాదు. కానీ బిగ్ బాస్ షో కారణంగా హేటర్స్ ని పెంచుకుంది శ్రీముఖి. మరి ఈ షో ద్వారా తనపై ఏర్పడిన వ్యతిరేకతను పోగొట్టుకొని అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి!