ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలోలేనని.. ప్రతిరోజు షూటింగ్స్ లో బిజీగా ఉంటున్నానని.. యాంకర్ శ్రీముఖి అన్నారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది శ్రీముఖి. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..?' అని అడిగిన ప్రశ్నకి ఉన్నాననే అర్ధం వచ్చేలా సమాధానమిచ్చింది శ్రీముఖి.

దీంతో పలు వెబ్ సైట్లు శ్రీముఖి ప్రేమలో పడిందంటూ వార్తలు రాశారు. దీనిపై ఫైర్ అయిన శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను ప్రస్తుతానికి ఎవరితో ప్రేమలో లేనని వెల్లడించింది.

తాను ఒకప్పుడు ప్రేమలో ఉన్నానని.. ఆంగ్లంలో సమాధానమిస్తే దాన్ని తప్పుగా అర్ధం చేసుకొని ఇప్పుడు ప్రేమలో పడిందంటూ వార్తలు రాశారని.. అవి చూసిన తన స్నేహితులు నిజమేనా..? అంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని చెప్పింది.

ఖరీదైన ఇళ్లు కొన్న శివజ్యోతి... గృహప్రవేశంలో బిగ్ బాస్ గ్యాంగ్ సందడి!

రాసేవాళ్లకి న్యూస్ అవసరం ఉందని తనకు బాగా తెలుసునని.. కాబట్టి ఇలాంటి వార్తలు రాసేవాళ్లు కొంచెం చూసుకొని.. పూర్తిగా విషయం తెలుసుకొని రాస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తను షూటింగ్స్ తో చాలా బిజీగా ఉన్నానని.. ఇప్పుడైతే ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవని తెలిపింది. ఒకవేళ గనుక తను నిజంగానే ప్రేమలో పడితే.. అతనితో ఒక వీడియో చేసి 'ఫైనల్ గా ప్రేమలో పడ్డాను' అంటూ అందరికీ చెబుతానని వెల్లడించింది.