నీది నాది ఒకటే కథ,  బ్రోచేవారెవరురా హిట్ తర్వాత యంగ్ హీరో  శ్రీ విష్ణు పరిస్దితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఆయన చేసిన  తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఇంతకాలం వేచి ఉన్నదానికి శ్రీవిష్ణుకు మంచి రోజులు వచ్చాయి అందరూ అన్నారు. శ్రీవిష్ణు సైతం ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ అంటూ  మీసం తిప్పి కాలరు ఎగరేసి చెప్పాడు. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది.

మీసం మొత్తం కాదు కదా...అందులో ఒక వెంట్రుక కూడా తిప్పలేకపోయాడని అందరూ తేల్చి చెప్పేసారు. అయితే సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించక, యాక్షన్ సినిమా , డిఫరెంట్ పాయింట్ అనుకుని బయ్యర్లు ఎగబడటంతో అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంతకు ముందు రిలీజ్ కూడా చాలా కష్టంగా చేయగలిగే పరిస్దితుల్లో ఉన్న ఈ హీరో కు ఇది ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. దాంతో తన లెవిల్ మారింది అని డిసైడ్ అయ్యాడు.

హీరో కూతురి లవ్ ఎఫైర్.. దారి తప్పుతోందా..?

 తిప్పరా మీసం పోయినా.. పెద్దగా విష్ణు క్రేజ్ తగ్గలేదని మీడియాలో వార్తలు వస్తూండటంతో...చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన శ్రీ విష్ణు ఇప్పుడు పెద్ద హీరోల లిస్ట్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దాంతో తనతో నాలుగైదు కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తానని వచ్చే వాళ్లకు అంత తక్కువ బడ్జట్ లో తను సినిమా చేయనని చెప్తున్నాడు. తనతో సినిమా చేస్తే.... శాటిలైట్, థియేట్రికల్ హక్కులతోనే లాభాలు వస్తున్నాయని శ్రీ విష్ణు సదరు నిర్మాతలతో చెప్పున్నారు.

కాబట్టి తన పై పెట్టే బడ్జెట్ మినిమం ఎనిమిది కోట్లకు తగ్గితే కుదరదని,అలా పెట్టే ఉద్దేశ్యం ఉన్నవాళ్లే నిర్మాతలుగా తన దగ్గరకు రావాలని ఓపెన్ గానే చెప్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాంతో శ్రీవిష్ణుతో సినిమా చేద్దామనుకునేవాళ్ల ఆశలుపై నీళ్లు పోసినట్లైంది. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టాక వెనక్కి తిరిగి రాకపోతే ఏంటి పరిస్దితి అంటున్నారు.

మినిమం గ్యారెంటీ హీరో అనటానికి లేదని, ఆ స్దాయి ఉంటే తిప్పరా మీసం ప్లాఫ్ టాక్ వచ్చినా జనం చూసేవారని, అప్పుడే ఏడు చేపల కథకు వచ్చిన కలెక్షన్స్ కూడా రప్పించుకోలేకపోయినప్పుడు అంతెంత బడ్జెట్ ఎవరు పెడుతారని అంటున్నారు.  ఏదైమైనా ప్లాఫ్ ల్లో ఉన్నప్పుడు కండీషన్స్ పెడితే చెల్లుబాటు కావు.