సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి చాలా కామన్. కొన్ని ప్రేమ కథలకు ఆరంభంలోనే ఎండ్ కార్డ్ పడుతుంది. మరికొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తుంటాయి. తాజాగా ఓ హీరో కూతురు ప్రేమలో పడిందని సమాచారం. టాలీవుడ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఈయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిని హీరోయిన్స్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. మరో అమ్మాయి సినీ రంగంలో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఓ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లింది కానీ మధ్యలోనే ఆగిపోయింది.

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్!

అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ఓ యువహీరోతో ప్రేమాయణం నడుపుతోందని టాక్. ఈ హీరో చేతుల్లో ప్రస్తుతం సినిమాలు లేవు. ఆ మధ్య బిగ్ బాస్ షోకి వెళ్లి.. తన ఆవేశంతో కాస్త పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ సినిమా అవాకాశాలు మాత్రం రాలేదు. కానీ హీరో గారి కూతురిని ప్రేమలో దించడంలో మాత్రం ఈ హీరో సక్సెస్ అయ్యాడు.

ఈ ప్రేమ విషయం కాబోయే హీరోయిన్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. కెరీర్ ఇంకా సెటిల్ కాకముందే  ఈ ప్రేమలు ఏంటని కూతురిపై హీరో గారు ఫైర్ అవుతున్నారట.

వాళ్లది ప్రేమ పెళ్లి అయినప్పటికీ కూతురు ప్రేమ అంటూ ఎక్కడ దారి తప్పుతుందోనని బెంగ పడుతున్నారట. అయినప్పటికీ కాబోయే హీరోయిన్ మాత్రం తన తండ్రి మాటని పట్టించుకోవడం లేదట. మరి ఈ ప్రేమ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి!