తెలుగు యాంకర్ శ్రీ ముఖి ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోలో గట్టి పోటీని ఇస్తూ గేమ్ ఆడుతున్న శ్రీ ముఖి హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ కి మధ్యలో బ్రేక్ పడింది. అమ్మడు బిగ్ బాస్ షోతో బిజీగా ఉండడంతో ఓ వైపు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. 

దసరా సందర్బంగా సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. శ్రీ ముఖి గన్ పట్టుకొని డిఫరెంట్ గా కనిపించింది. ఫైర్ ని పట్టుకోగలరా? అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. గౌతమ్ ఇవిఎస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్  ఎస్ ఎస్ ఎస్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్టైల్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లం శుభాష్, గౌతమ్ ఈ వి ఎస్, సిద్దిపల్లి సూర్యనారాయణ నిర్మాతలు. 

డిఫరెంట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ లేడి ఓరియెంటెడ్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక శ్రీ ముఖి బిగ్ బాస్ షో నుంచి బయటకు రాగానే షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక మరోవైపు పునర్నవి నటిస్తున్న సైకిల్ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ;గతవారం ఆమె ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మరి బిగ్ బాస్ ద్వారా ఈ బ్యూటీలు హీరోయిన్స్ గా ఎంతవరకు క్లిక్కవుతారో చూడాలి.

''హీరో రోల్ కాదు కానీ.. కీ రోల్..'' యాక్టింగ్ కుమ్మేశారు!