విధి చేసే వింతలు చాలా విచిత్రంగా ఉంటాయి. కాలానికి ఎవరూ అతీతులు కారు. వెండితెరపై స్పైడర్ మ్యాన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ పిచ్చే. స్పైడర్ మ్యాన్ చిత్రాలతో హీరో టామ్ హాలండ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. 

టామ్ హాలండ్ వెండితెరపై సూపర్ హీరో. రియల్ లైఫ్ లో సూపర్ హీరో కాకపోయినప్పటికీ అతడికి వచ్చిన లోటు ఏమి లేదు. అలాంటి టామ్ హాలాండ్ కూడా ఓ సమయంలో భిక్షగాడి సాయం తీసుకున్నాడట. టామ్ హాలండ్ ఎదుర్కొన్న ఆ సంఘటన అంత ప్రమాదమైనది కానప్పటికీ ఆసక్తికరమైనదే. 

టామ్ హాలండ్ ఓ షాపింగ్ కోసం ఓ మాల్ కు వెళ్ళాడు. అక్కడ ట్రాలీకి ఒక పౌండ్(రూ94) ఇవ్వాలి. కానీ హాలండ్ వద్ద చిల్లర లేదట. చిల్లర కోసం హాలండ్ నానా ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన ఓ భిక్షగాడు టామ్ హాలండ్ కు ఒక పౌండ్ ఇచ్చాడు. 

లిప్ లాక్ చేయాలని అడిగారు.. 'జులాయి' అప్పుడే నాన్న వార్నింగ్, శ్రీముఖి షాకింగ్ కామెంట్స్

దీనితో టామ్ హాలండ్ షాపింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ భిక్షగాడు చేసిన సాయానికి కృతజ్ఞతగా అతడికి అదనంగా 100 పౌండ్లు ఇచ్చాడట టామ్ హాలండ్. ఏ సంఘటనని అక్కడున్న ఓ మహిళ, ఆమె కుమార్తె గమనిస్తూనే ఉన్నారు. ఈ సంఘటనతో టామ్ హాలండ్ పై వారికి మరింత గౌరవం పెరిగిందట.