సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రైలర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. సమకాలీన ఏపీ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో నారా చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్, లోకేష్, కేఏప పాల్ ఇలా అన్ని పాత్రలు ఉన్నాయి.

కానీ ట్రైలర్ లో బాలకృష్ణ పాత్ర మాత్రం ఎక్కడా కనిపించలేదు. చివరికి బ్రాహ్మణి, దేవాన్ష్ పాత్రలకు కూడా చోటు కల్పించిన వర్మ.. బాలయ్యని మాత్రం చూపించలేదు. ట్రైలర్ లో కనిపించిన పాత్రలతో పాటు ఇప్పుడు ట్రైలర్ లో లేని బాలయ్య పాత్రపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.

'కమ్మరాజ్యంలో' పప్పు సీన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య ఉన్నాడట. కాకపోతే ట్రైలర్ లో మాత్రం చూపించలేదు. దానికి కారణంగా బాలయ్యని స్పెషల్ గా ట్రీట్ చేయాలని వర్మ ఫిక్స్ అయ్యాడట. బాలయ్యని ఫోకస్ చేస్తూ చిన్న వీడియో టీజర్ రిలీజ్ చేస్తారట.

అంతేకాదు.. గతంలో బాలకృష్ణ ఓ ఫంక్షన్ లో 'మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు' అని ఓ డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు ఆ డైలాగ్ ని బాలయ్య పాత్రధారితో చెప్పించాడట. ట్రైలర్ లో సినిమాలో ఉన్న అన్ని పాత్రలను పరిచయం చేసిన వర్మ ఇకపై ఒక్కో పాత్రకు సంబంధించి ఒక్కో క్లిప్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట.

ఇందులో భాగంగా చంద్రబాబు, జగన్, పవన్, కేఏ పాల్ పాత్రలతో పాటు బాలయ్యకి సంబంధించిన క్లిప్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి ఆర్జీవి తనకు మాత్రమే తెలిసిన పబ్లిసిటీ స్ట్రాటజీలతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.