సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా ట్రైలర్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటివరకు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'.. బ్రహ్మీ, అలీ రేంజ్ తగ్గిందా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ ట్రైలరే హాట్ టాపిక్.  ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద ఎంత కాంట్రవర్శియల్ గా సినిమా తీయోచ్చో అంతలా తీశాడు వర్మ. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అతడి వర్గం పడుతున్న ఇబ్బందుల ప్రధానంగా ఈ సినిమాను నడిపిస్తున్నారు. బెజవాడ రౌడీయిజంపై ఈ సినిమాలో కీలక సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ట్రైలర్ లో మిగతా సీన్లన్నీ ఒక ఎత్తయితే.. చివర్లో నారా లోకేష్ పాత్రధారి ఏడుస్తూ భోజనం ముందు కూర్చుంటే చంద్రబాబు పాత్రధారి భోజనం వడ్డిస్తూ ప్లేటులో పప్పు వేసే సీన్ చాలా అతిగా అనిపించింది. నారా లోకేష్ ని ప్రత్యర్ధులు 'పప్పు' అనే సెటైర్లు వేయడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ పడటం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. ఆ విషయాన్ని హైలైట్ చేసే విధంగా పప్పు వడ్డించే సీన్ పెట్టాడు వర్మ.

 

 

ఇది చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీ వారికి ఆగ్రహం తెప్పిస్తుందనే విషయంలో సందేహం లేదు. ఈ సినిమా గురించి, ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడానికి బాగా స్కోప్ ఇచ్చింది కూడా ఈ షాట్ అనే చెప్పాలి. ఈ సినిమా గురించి తెలుగుదేశం వారు ఎంత గొడవ చేస్తే సినిమాకి అంత పబ్లిసిటీ వస్తుందని వర్మ భావిస్తున్నట్లు ఉన్నాడు.