యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. సినిమాకి కలెక్షన్స్ వచ్చినప్పటికీ కథ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.

కథకి అవసరం లేని భారీతనాన్ని యాడ్ చేసి సినిమా ఫెయిల్ అయ్యేలా చేశారు. ఈ సినిమా  దెబ్బకి ప్రభాస్ కొంతకాలం బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా మొదలుపెట్టాడు. యువి క్రియేషన్, కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు జరిపారు. అమెరికాలో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది.

Bigg Boss 3: నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..?

'సాహో' కారణంగా ఈ సినిమాకి కాస్త బ్రేక్ వచ్చింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ రెడీ చేస్తున్నారు. సుమారు రూ.2 కోట్లకు పైగా ఈ సెట్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రైలు పెట్టెల సెట్ లను అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కాబట్టి అప్పట్లో రైలు భోగీలు ఎలా ఉండేవో.. అదే విధంగా సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్.

ఈ సెట్ లో సుమారు 11రోజులు షూటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో డెబ్బై శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది.  అన్నపూర్ణలో జరిపే ఈ షెడ్యూల్ తో ప్రారంభించి.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉంది యువి నిర్మాణ సంస్థ.  

ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం రైలు పెట్టె సెట్ వేసి షూటింగ్ నిర్వహించారు. ఇప్పుడు అదే అన్నపూర్ణలో మరో రైలు సెట్ వేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.